కంచికచర్ల (ఎన్టీఆర్) : భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31 వ వర్థంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కంచికచర్ల పట్టణంలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శైలజానాథ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా దాదె సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీ మాత్రమేనని శైలజానాథ్ పేర్కొన్నారు. అభివృద్ది చెందుతున్న దేశాల సరసన భారతదేశాన్ని నిలిపిన ఘనత కూడా రాజీవ్ గాంధీదేనన్నారు. దేశంలోని పేదరికాన్ని పారదోలి సమసమాజ స్థాపనకు రాజీవ్ గాంధీ చేసిన కృషి ఎప్పటికి మనవబోమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శైలజానాథ్ కొనియాడారు.










