Jan 20,2023 21:27

ఫొటో : బాలికలతో మాట్లాడుతున్న ఎంఇఒ నాగేశ్వరరావు

ఘనంగా బాలికల దినోత్సవం
ప్రజాశక్తి-అల్లూరు : మండల కేంద్రం స్థానిక బోర్డు స్కూల్లో శుక్రవారం ఎంఇఒ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా బాలికల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలను అన్ని రంగాలలో ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. సమాజంలో బాలికల హక్కుల కోసం రాజ్యాంగంలో అనేక చట్టాలు పొందుపరచినట్లు తెలిపారు.
ఆడా, మగ అనే వివక్షతకు స్వస్తి పలికి తల్లిదండ్రులు ఆడపిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని కోరారు. నేటి సమాజంలో అన్ని రంగాలలో బాలికలు ముందంజలో ఉన్నారన్నారు.