Jan 24,2023 18:41

బాలికా దినోత్సవంలో పాల్గొన బాలికలు

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం బాలికా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. సౌత్‌ ఆములూరు ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు షేక్‌. అహ్మద్‌ బాషా ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు జరిగాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. రామానుజయ్య బాలికా దినోత్సవం యొక్క ఉదేశ్యం, ప్రాముఖ్యతను విదార్థులకు తెలియజేశారు. ఉపాధ్యాయులు అహ్మద్‌ బాషా మాట్లాడారు. పాఠశాలలో జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యాస రచన, వకత్వం, క్వీజ్‌ పోటీలలో మహిమారాణి, ఫరీదా, హేమ, లక్ష్మీ దీపక్‌ విజేతలుగా నిలిచారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎ. సుభాషిణి పాల్గొన్నారు.