యోగా చేస్తున్న విద్యార్థులు
ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
నెల్లూరు :కొండాయపాళెం లోని నగర పాలక ప్రాథమిక పాఠశాల లో బుధవారం ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యం భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం 2015 జూన్ 21న నిర్వహించారు.అంతర్జాతీయ యోగ దినోత్సవము ప్రతి సంవత్సరం జూన్ 21 న జరుపుకుంటారు. 2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోడి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొనుట గురించి ప్రతిపాదన చేశారు. ఈ తీర్మానానికి 193 ఐరాస ప్రతినిధులలో 175 మంది మద్దతు ఇచ్చారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ధ్యానం, యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హరీష్, రాశి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.










