May 22,2023 20:53

కరపత్రాలు పంపిణీ చేస్తున్న జెవివి అధ్యక్షులు ప్రభుచరణ్‌

వాల్మీకిపురం : అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా సోమవారం జనవి జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెవివి అధ్యక్షులు ప్రభుచరణ్‌ మాట్లాడుతూ మన దేశంలో జీవవైవిధ్యంపై ఆధారపడి 60 శాతం మంది బతుకుతున్నట్లు ఒక అంచనా ఉందన్నారు. మనం ప్రకృతిని అవసరానికి మించి వాడటం గాని, వనరుల్ని దుర్వినియోగం చేయడం గాని, వికృతమైన జీవన విధానం అవలంభించడం గాని వదిలివేయాలని, మనిషి జీవనశైలిని ప్రకృతికి అనుగుణంగా మార్చుకోవాలని, రసాయనాల వాడకం తగ్గించి జంతువులను, మొక్కలను పరిరక్షించుకొని జీవవైవిధ్యాలను కాపాడుకోవాలన్నారు. ఇటీవల జన్యుమార్పిడి కూడా జీవ వైవిధ్యాన్ని భారీగా దెబ్బతీస్తోందన్నారు. మనవంతు బాధ్యతగా రసాయన కాలుష్యాన్ని అరికట్టి భూతాపాన్ని తగ్గించడం, జంతువులను, మొక్కలను పరిరక్షించడం, ప్లాస్టిక్‌ వడకాన్ని తగ్గించి జనపనార సంతులను వాడటం చేయాలన్నారు. అడవులు, జీవ, జల రాశులను ఇప్పటికైనా పరిరక్షించుకోనట్లయితే రాబోయే రోజుల్లో మానవజాతి మనుగడకే ముప్పు తప్పదని, అంతరిస్తున్న జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం మన అందరి బాధ్యత అని తెలిపారు.