Mar 28,2022 16:15

ప్రజాశక్తి-తెనాలి : ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని రైతు సంఘం నాయకులు వి కృష్ణయ్య డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా తెనాలి పురపాలక సంఘం కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ మెయిన్ రోడ్డు గాంధీ చౌక్ బస్ రోడ్డు శివాజీ చౌక్ మీదుగా సాగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య య మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి, కార్పొరేట్ లకు దారాదత్తం చేసే కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తున్నామన్నారు. ఎన్నో ఉద్యమాల ఫలితంగా కార్మికులు సాధించుకున్న 45 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లు గా మార్చిన కేంద్రం తక్షణమే వాటిని రద్దు చేసి కార్మిక చట్టాలు పునరుద్ధరించాలన్నారు. సామాన్యులకు పెను భారంగా మారిన వంటనూనెలు, వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు తక్షణమే నియంత్రించాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో సిపిఎం, సిపిఐ వామపక్ష పార్టీలతో పాటు, సిఐటియు, ఎఐటియుసి, భవన నిర్మాణ కార్మిక సంఘం, మున్సిపల్ వర్కర్స్ యూనియన్, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం, తాపీ వర్కర్స్ యూనియన్, తదితర ప్రజాసంఘాల నాయకులు కార్మికులు పాల్గొన్నారు. ర్యాలీలో లో సీటు జిల్లా కార్యదర్శి కె బాబు ప్రసాద్ షేక్ హుస్సేన్ వలి తదితరులు ప్రసంగించారు.