Mar 28,2022 15:55

ప్రజాశక్తి-చీమకుర్తి : దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈరోజు చీమకుర్తిలో సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చీమకుర్తి ఆర్టీసీ బస్టాండ్ నుండిస్టేట్ బ్యాంక్ వరకు భారీ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పమిడి వెంకట్రావు మాట్లాడుతూ 'కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక రైతు ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని కార్పొరేట్ కంపెనీలు అనుకూలమైన విధానాలు అమలు చేస్తూ వారి సంపద పెంచుతుందని దీని వలన ప్రజల కష్టాలు రోజు రోజుకి పెరుగుతుంది.  పెట్రోల్, డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి,కార్మికుల నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్స్ రద్దుచేయాలి. కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలి. కార్మికులను పర్మినెంట్ చేయాలి,ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు చట్టం చేయాలి,ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచి పట్టణాలు కూడా విస్తరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు, వీరాంజనేయులు, పి ఆంజనేయులు జిల్లా నాయకులు పి.వెంకట్ రావు మాట్లాడారు. గ్రానైట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఆర్ ఆంజనేయ రెడ్డి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నాగయ్య, ముఠా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు జి ప్రసాద్, కె వెంకటేశ్వర్లు, రైతు సంఘం నాయకులు కొల్లూరు వెంకటేశ్వర్లు, కెవిపిఎస్ మండల కార్యదర్శి టి రామారావు, సిఐటియు నాయకులు యోహాను పి ఏడుకొండలు, బి సురేష్, కోటేశ్వరరావు, అంగన్వాడి యూనియన్ నాయకులు శారద, రాధ, మాధవి ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు జి ప్రభుదాసు కార్మికులు పాల్గొన్నారు