Jan 06,2023 21:57

ఫొటో : మాట్లాడుతున్న డాక్టర్‌ ఎం.శివ కల్పన

గురుకుల విద్యార్థులకు వైద్య పరీక్షలు
ప్రజాశక్తి-ఉదయగిరి : గురుకుల పాఠశాల విద్యార్థులకు గండిపాలెం పిహెచ్‌ వైద్యాధికారిణి ఎం.శివ కల్పన శుక్రవారం ఆరోగ్య పరీక్షలను నిర్వహించారు. వారికి మందులను పంపిణీ చేసి కొంతమందికి చికెన్‌పాక్స్‌ లక్షణాలు ఉన్న వారిని పరీక్షించి వారికి వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాధి సోకినవెంటనే విద్యార్థులను తోటి విద్యార్థుల నుంచి వేరు చేసి ఒకేగదిలో ఉంచి వారికి తగిన సదుపాయాలు కల్పిస్తూ ఉండాలని సూచించారు. అదేవిధంగా స్కాబీస్‌ విద్యార్థులకు తగు మందులతో చికిత్స నిర్వహించి వారికి తగు, సూచనలు ఇచ్చి, వ్యక్తిగత పరిశుభ్రత గురించి తెలియజేశారు.
విద్యార్థుకు ఆహార పదార్థాలు, కాచి చల్లార్చిన నీటిని తాగాలని, ఉతికిన బట్టలను సూర్యరశ్మి తగిలే విధంగా ఆరవేయాలని సూచించారు. తడిబట్టలు ధరించ రాదన్నారు. విద్యార్థుల వసతి గృహాలను పరిశీలించి ప్రిన్సిపాల్‌కు తగిన సలహా సూచనలిచ్చారు. భోజనశాలలను పరిశీలించి భోజనం పంపిణీ విధానాన్ని క్వాలిటీని పరిశీలించారు. ఎవరైనా విద్యార్థులు అనారోగ్యానికి గురైతే వెంటనే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి చికిత్స చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య విద్యాధికారి కలసాపటి.వెంకటసుబ్బయ్య, సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ నౌషాద్‌, ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ ధనరాజ్‌, ఆరోగ్య పరిరక్షకుడు అక్బర్‌, చంద్రమౌళి, విజరు కుమారి, అరుణ పాల్గొన్నారు.