మాట్లాడుతున్న మాజీ ఐఎఎస్ అధికారి విజయకుమూర్
ప్రజాశక్తి-గుడ్లూరు : పేదల ఐక్యమత్యమే ధ్యేయంగా ఐక్యత విజయ పథం పేరుతో మాజీ ఐఎఎస్ విజరు కుమార్ చేపట్టిన పాదయాత్ర మంగళవారం రాత్రి గుడ్లూరు చేరింది. ప్రచార జాత గుడ్లూరు చేరుకోగానే ఎస్‌సి కాలనీ వాసులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ప్రచార జాత స్థానిక బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన వేదికపై విజరు కుమార్ ప్రసంగం జనాన్ని ఆకట్టుకుంది. పేదరికం నిర్మూలన కోసం ఐదు అంశాలతో పాంప్లెట్లు స్థానిక కార్యకర్తల ద్వారా పంపిణీ చేశారు. ఐక్యత విజరు పదానికి అందరూ సహకారం అందించాలన్నారు. భూమిలేని పేద కుటుంబాలకి భూములు పంపిణీ చేసేందుకు కషి చేస్తామన్నారు లక్షలాది మంది నిరక్షరాశులకి ఉపాధి కల్పించేందుకు పనిచేస్తామన్నారు. నిరక్షరాస్టులలో అక్షర జ్యోతిని వెలిగించి చైతన్యం తీసుకువస్తామన్నారు.










