Apr 11,2023 20:34

మాట్లాడుతున్న ఆర్‌జెడి

మాట్లాడుతున్న ఆర్‌జెడి
గుడ్‌ కండీషన్‌ గదుల్లోనే
'జగనన్న కానుకలు'
కొడవలూరు:గుడ్‌ కండీషన్లో ఉన్న గదుల్లోనే జగనన్న విద్యా కానుకలు భద్రపరచి పాఠశాలలకు తరలించడం జరుగుతుందని విద్యాశాఖ ఆర్‌జెడి విఎస్‌.సుబ్బారావు స్పష్టం చేశారు. స్థానిక జెడ్‌పి ఉన్నత పాఠశాలలోని గదులను మంగళవారం ఆయన పరిశీలించి గుడ్‌ కండీషన్లో ఉన్న నాలుగు గదులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 80 పాఠశాలల విద్యార్థులకు సంబంధించిన జగనన్న విద్యా కానుకల కిట్లను ఎంపిక చేయబడ్డ గదుల్లో భద్రపరచి ఇక్కడి నుంచి అన్నీ పాఠశాలలకు తరలించడం జరుగుతుందన్నారు. కిట్లను జాగ్రత్తగా భద్రపరచి పాఠశాలలకు తరలించేందుకు 18 మంది సభ్యులతో ప్రత్యేక బందాన్ని ఏర్పాటు చేశారు.. అంతేకాకుండా కిట్లు భద్ర పరచిన గదుల వద్ద నైట్‌ వాచ్‌మెన్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభించే సమయానికి విద్యార్థులందరికీ విద్యా కానుకలు అందేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ముందస్తుగా విద్యా కానుకలను తరలిస్తున్నామన్నారు. అనంతరం పాఠశాలలో స్టడీ అవర్లో ఉన్న పాఠశాలలు పునః ప్రారంభించే సమయానికి విద్యార్థులందరికీ విద్యా కానుకలు అందేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ముందస్తుగా విద్యా కానుకలను తరలిస్తున్నామన్నారు. అనంతరం పాఠశాలలో స్టడీ అవర్లో ఉన్న పదో తరగతి విద్యార్థులతో ఆయన మాట్లాడారు. పరీక్షలు బాగా రాస్తున్నారా. లేదా ఆరా తీశారు. ఆయన వెంట సీసీ ఎస్‌కె మహబూబ్‌ బాషా, ఎంఇఒ జి.వసంతకుమారి, హెచ్‌ఎం ఇందిరాదేవి, సీఆర్పీలు జే. పెంచలరావు, ఎం.దయాకర్‌, ఉపాధ్యాయులున్నారు.