'గృహకల్ప' లబ్ధిదారులకు అవగాహన
ప్రజాశక్తి-ఉదయగిరి : మండల పరిధిలోని గండిపాలెం వెంగళరావు నగర్ పంచాయతీలో ఉన్న జగనన్న గృహకల్ప లబ్ధిదారులకు శుక్రవారం ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గండిపాలెంలో 44 మంది వెంగళరావునగర్లో 55 మంది జగనన్న ఇళ్లస్థలాలు పొందిన లబ్ధిదారులు గృహాలు నిర్మించుకునేందుకు త్వరితగతిన సిద్ధం కావాలని సూచించారు. గృహ నిర్మాణాలు ప్రారంభిస్తే ప్రభుత్వం తరఫున లక్షల 80 వేలు రూపాయలు పొదుపు సంఘాల ద్వారా బ్యాంకులతో మరికొంత ప్రోత్సాహకాలు అందుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని, నవరత్నాల్లో భాగంగా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేకయించారని తెలిపారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఆయన కోరారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే మరికొన్ని రాయితీలు వివరించారు. గండిపాలెంలో సొంత ఇంటి స్థలాలు నిర్మాణం చేపట్టే ఐదు మంది కలరని వారి కూడా నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. నిర్మాణ పనులు సొంతగా నిర్మించుకోవచ్చు అని లేని పక్షంలో సిబ్బంది సహకారంతో నిర్మాణాలు చేపడతామన్నారు. వీటిపై వాలంటీర్లు లబ్ధిదారుల నుండి వివరాలు సేకరించి లబ్ధిదారులకు నచ్చినట్లు నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. ముందుగా సచివాలయం, పిహెచ్‌సిని తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు సలహాలు చేశారు. ప్రభుత్వం చేపట్టి సర్వేలకు సిబ్బంది సహరించి 100 శాతం పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాపల్లి.భారతీ, మొండ్రు తిరుపతి పంచాయతీ కార్యదర్శి అమర్నాథ్ రెడ్డి, సచివాలయ కన్వీనర్ భాషా, సచివాలయ సిబ్బంది లబ్ధిదారులు పాల్గొన్నారు.










