Feb 07,2023 21:41

ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ విక్రమ్‌రెడ్డి

గృహ సారథులకు శిక్షణ
ప్రజాశక్తి మర్రిపాడు : మండలంలోని బ్రాహ్మణపల్లిలోని మేకపాటి నివాసంలో ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి, వైసిపి నియోజకవర్గ పరిశీలకులు సింగసాని గురుమోహన్‌తో కలసి సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులతో శిక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు, గృహసారథులు సమన్వయం చేసుకుని పనిచేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు సక్రమంగా అందేలా చూడాలన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఏ పథకంలోనూ అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందిన ప్రతి కుటుంబం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వెంట ఉంటామని చెబుతున్నారన్నారు. కుల, మత, పార్టీలకతీతంగా పథకాలు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం వైసిపి అని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థలు దేశ వ్యాప్తంగా ప్రసంశలు పొందాయని తెలిపారు. సమిష్టిగా అందరం కలిసికట్టుగా పనిచేసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ప్రజలు మరోసారి ఆశీర్వదించేలా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన విధులు, బాధ్యతలను నెరవేర్చాలన్నారు. నియోజకవర్గ పరిశీలకులు సింగసాని గురుమోహన్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందనివారికి తోడుగా ప్రస్తుతం ఒక వాలంటీర్‌కు ఏర్పాటు చేసిన ఇద్దరు గృహ సారథులు వైసిపి అందజేస్తున్న సంక్షేమ పథకాలను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గృహసారథులకు అందజేసే కిట్‌ను, దాని ద్వారా సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు నిర్వహించాల్సిన విధుల గురించి వివరించారు. కార్యక్రమంలో కన్వీనర్‌ సుబ్బిరెడ్డి, మాజీ కన్వీనర్‌ శ్రీనివాసులు నాయుడు, మండల సచివాలయాల కన్వీనర్‌ సిద్ధంరెడ్డి మోహన్‌ రెడ్డి, పలు గ్రామాల సర్పంచ్‌ లు ఎంపీటీసీ లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.