నల్లమాడ : పక్కా గహ నిర్మాణాలను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక హౌసింగ్ కార్యాలయం వద్ద గురువారం గృహ లబ్ధిదారులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. సకాలంలో నిర్మాణాలు పూర్తి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, వాలెంటీర్లు కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. బిల్లుల మంజూరులో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మండల పరిధిలోని 14 గ్రామ సచివాలయాల పరిధిలో నిర్మాణాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ అధికారులతో పాటు ఎంపీపీ సునీతాబాయి, మండల ఉపాధ్యక్షులు సూర్యనారాయణ, తహశీల్దార్ దేవేంద్ర నాయక్, ఎంపీడీవో రామచంద్రారెడ్డి, ఏపీవో సూర్యనారాయణ, వైసిపి మండల కన్వీనర్ రామాంజనేయులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఓబుల దేవర చెరువు : మండలంలో హౌసింగ్ లబ్దిదారులు, అధికారులతో స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారులందరూ పూర్తిస్థాయిలో గృహ నిర్మాణాలు చేసుకోవాలని అందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసందర్భంగా ఆయన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీధర్, ఎంపీడీవో పోలప్ప, హౌసింగ్ డిఇ నాగరాజు, మండల టౌన్ కన్వీనర్ కోళ్ల కృష్ణారెడ్డి, ఎంపీపీ పర్వీన్, జెడ్పీటీసీ కుర్లి దామోదర్ రెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు, అధికారులు, హౌసింగ్ లబ్ధిదారులు పాల్గొన్నారు.










