రాయచోటి :రీ సర్వే ప్రక్రియలో భాగంగా సర్వే రాళ్ళు పాతడం, గృహ నిర్మాణాల లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం వివిధ ప్రభుత్వ పథకాల అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్‌లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవ హర్‌రెడ్డి విసి ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ మినీ విసి హాలు నుంచి కలెక్టర్, జెసి ఫర్మాన్‌అహ్మద్‌ఖాన్ పాల్గొన్నారు. విసి ద్వారా జవహర్‌రెడ్డి మాట్లా డుతూ జిల్లాలో రీసర్వే ప్రక్రియ, జాతీయ రహదారుల భూసేకరణ, గృహ నిర్మా ణాల స్టేజి కన్వర్షన్స్‌లో నిర్దేశించిన లక్ష్యాలను వేగవంతం చేయాలన్నారు. స్పందన గ్రీవెన్స్‌లను నాణ్యతతో పరిష్కరించాలన్నారు. పర్యాటక అభివద్ధిలో భా గంగా చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి పర్యాటక శాఖకు భూమి కేటా యింపులు త్వరితగతిన చేయాలన్నారు. వ్యవసాయ మరియు అనుబంధ శాఖలు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం అర్జీలను సకాలంలో నాణ్యతగా అర్జీదారుల సంతృప్తి మేరకు పరిష్క రించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విసి అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారిం చాలన్నారు. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి. వివిధ దశల్లో ఉన్న గృహాలలో వారం వారం పురోగతి సాధించి త్వరగా పూర్తి చేసే దిశగా కషి చేయాలన్నారు. జిల్లాలో అమలు చేస్తున్న జగనన్న భూహక్కు - భూ రక్షలో మొదటి దశ రీ సర్వే ప్రక్రియ పూర్తయిన గ్రామాల్లో లక్ష్యం మేరకు హద్దురాళ్ళు పాతడం పూర్తి చేయాలని, రెండవ దశ చేపట్టిన గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వ్యాలిడేషన్, వెక్టరైజేషన్ డిఎల్ ఆర్ పబ్లిష్ చేయడం తదితరాలు సకాలంలో పూర్తి అయ్యేలా ప్రణాళికా బద్ధంగా పనిచేయాలన్నారు. అనంతరం పలు అంశాలలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు. సమీక్షలో డిఆర్‌ఒ సత్యనారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.










