Feb 08,2023 22:20

ఫొటో : జగనన్న లే అవుట్‌లో సమస్యలు తెలుసుకుంటున్న సిపిఎం నాయకులు డేవిడ్‌ రాజు

గృహ నిర్మాణాలకు నీటివసతి కల్పించండి
ప్రజాశక్తి-ఆత్మకూరుఅర్బన్‌ : నెల్లూరుపాలెం పరిధిలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలకు నీటి వసతి కల్పించాలని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్‌ రాజు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం జగనన్న కాలనీలలో సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలు చేపట్టి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు స్లాబ్‌ వేసిన గృహాలు చాలా తక్కువని, కొంతమంది లబ్ధిదారులు బేస్‌మట్టం కూడా వేయడం లేదని కొంతమంది బేస్‌మట్టం వేసి కూడా ఆగిన దాఖలాలు ఉన్నాయని అయితే లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
లబ్ధిదారుల సమాచారం మేరకు నిర్మాణం చేపట్టడానికి కనీస నీటివసతి కరువైందని వారు వాపోయా ఒక రూ.1,80,000 ప్రస్తుతం పెరిగిన రేట్లకు అనుగుణంగా అనుగుణంగా ఇళ్ల నిర్మాణం చేపట్టలేమని తెలిపారు. అయితే అధికారులు కాంట్రాక్ట్‌ వ్యవస్థను తీసుకురావడంతో ఈ కాంట్రాక్టర్లు పత్తా లేకుండా పోయారన్నారు. కొన్ని ఇళ్లు నిర్మాణాలు బేస్‌మట్టానికే పరిమితమయ్యాయని తెలిపారు. అధికారులు ఇకనైనా అధికారులు లబ్ధిదారులకు ఒక టెక్నీషియన్‌ ఏర్పాటు చేసి మోటార్‌ ఆపరేట్‌ చేసి లబ్ధిదారులకు నీటివసతి కల్పించాలని కోరుకుంటున్నామన్నారు. లేనిపక్షంలో లబ్ధిదారులతో కలిసి లబ్ధిదారులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.