లబ్ధిదారులతో మాట్లాడుతున్న కమిషనర్ ప్రమోద్ కుమార్
హిందూపురం : మున్సిపాలిటీలో గృహాలు మంజూరైన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేసుకోవాడానికి ముందుకు రావాలని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ కోరారు. ఆయన శనివారం కొట్నూరు జగనన్న లే అవుట్‌ను పరిశీలించారునప. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడుతూ మొత్తం 6,775 గృహాలకు గానూ 426 ఇళ్లు పూర్తి కాగా కొందరు గృహ ప్రవేశాలు చేశారన్నారు. ప్రభుత్వం రూ. 1.80 లక్షలు ఇవ్వడంతో పాటు అదనంగా మెప్మా ద్వారా రూ. 35 వేలు మంజూరు చేస్తుందని, ఈ నిధులతో గడువులోగా పూర్తి చేసుకోవాలన్నారు. లే అవుట్‌లో మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. ఆయన వెంట అసిస్టెంట్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, హౌసింగ్ డిఈఈ శివకుమార్ నాయక్, ఎఈ ఫణి రాజ్, మెప్మా సిఎంఎం హరినాథ్ రెడ్డి, అమ్యూనిటీ సెక్రటరీలు ఉన్నారు.










