రాజంపేట : జిల్లాలో నిర్ధేశించిన మేరకు గృహ నిర్మాణ లక్ష్యాలను అధిగమించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ గిరీష అన్నారు. మంగళవారం మండలంలోని పులపుత్తూరు, ఎస్‌సి కాలనీలలో ఇళ్ల నిర్మాణాల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి అక్కడ జరుగుతున్న అభివద్ధి పనులను ప్రజల ద్వారా అడిగి తెలుసుకొని అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే వారం లోపల 30 ఇళ్లు రూఫ్ లెవల్‌కి తీసుకొని రావాలని గహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. ఇళ్ళ నిర్మాణాలు ఎప్పటిలోగా పూర్తి చేస్తారు, ఏఏ దశలలో పనులు జరుగుతున్నాయి వాటి వివరాలను అడిగి తెలుసుకొని జూన్ 20లోగా ఇళ్ళ నిర్మాణాలు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం కల్లా 60 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని తాహశీల్దార్‌ను ఆదేశించారు. శ్మశానం, దేవాలయంకు స్థలం చూపించారా లేదా అని గ్రామస్తులను కలెక్టర్ అడగగా, స్మశానం, దేవాలయానికి స్థలం చూపించారని కలెక్టర్ ఎదుట గ్రామస్తులు సంత ప్తి వ్యక్తం చేశారు. వీధి లైట్లు వచ్చే మంగళవారం లోపు అమర్చాలని ఎపిఎస్ పిడిసిఎల్ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. 30 ఇళ్లలో ఎన్ని ఇల్లు గోడల దశలలోకి చేరుకున్నాయి, పది రోజుల నుంచి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఒకటి కూడా బిల్లు ఎందుకు పెట్టలేదని గహ నిర్మాణ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడిసెలో ఉండే వారి బాధను అర్థం చేసుకోని త్వరగా వారి ఇళ్లను పూర్తి చేసి అప్పగించాలన్నారు. ఇళ్ళ నిర్మాణాల వేగావంతం కోసం కూలీల సంఖ్యను గణనీయంగా పెంచుకోవలన్నారు. మంచి నీరు త్వరగా ఇవ్వాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. స్టోరేజ్ ట్యాంకుల పనులను త్వరగా ప్రారంబించాలన్నారు. సొంతంగా ఇళ్లు నిర్మిచుకోనే వారికి ఇప్పుడు ఇచ్చిన రుణం కన్నా ఇళ్ల నిర్మాణం కోసం అదనంగా రూ.15 వేలు ఇవ్వాలని ఎపిఎంను ఆదేశించారు. ఉపాధి హామీ పధకం పనులు కూడా కల్పించాలన్నారు. మళ్లీ వచ్చేవారం విజిట్ చేస్తానని ఆలోగ పనులన్నీ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ఆర్‌డిఒ భాస్కర్, హౌసింగ్ పీడీ శివయ్య, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ ప్రసన్న కుమార్, తహశీల్దార్ సుబ్రహ్మణ్యంరెడ్డి, విద్యుత్ ఎఇ ఈశ్వర్ రాజు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.










