మాట్లాడుతున్న కమిషనర్ హరిత
గృహ లబ్ధిదారులకు ప్రత్యామ్నాయ రుణ సౌకర్యం
నెల్లూరు :ఎ.పి టిడ్కో గహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిమిత్తం బ్యాంకులనుంచి రుణాలు మంజూరుకాని లబ్ధిదారులకు ప్రత్యామ్నాయ రుణ సౌకర్యాలను కల్పించాలని హౌసింగ్ విభాగం అధికారులను నగర పాలక సంస్థ కమిషనర్ హరిత ఆదేశించారు. శుక్రవారం కార్పొరేషన్ లోని కమిషనర్ ఛాంబర్‌లో హౌసింగ్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ టిడ్కో గహాల్లో ప్లాటు మంజూరు అయినప్పటికీ, స్వాధీనం పొందని లబ్ధిదారులను ''అయిష్టత చూపుతున్న లబ్ధిదారులు'' కేటగిరీగా పరిగణించి, వారందరికీ నోటీసులు జారీ చేయాలన్నారు. రుణాల మంజూరు ప్రక్రియ పూర్తయిన గహాలను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, టి.పి.ఆర్.ఓ ప్రసాద్, మెప్మా పి.డి, టిడ్కో డి.ఈ.ఈ, సి.ఎమ్.ఎమ్, డి.సి.ఓ లు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న కమిషనర్
వాయు కాలుష్య నియంత్రణకు చర్యలు
నెల్లూరు :కార్పోరేషన్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్‌లో శుక్రవారం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్‌సిఎపి) లో భాగంగా సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో వాయు కాలుష్యం తగ్గించేందుకు చేపట్టవలసిన విధివిధానాలు, ూశీబతీషవ Aజూజూశీత్‌ీఱశీఅఎవఅ్ ూ్‌బసy, జుఎఱరరఱశీఅ ×అఙవఅ్‌శీతీy Aఅస జaతీతీyఱఅస్త్ర జaజూaషఱ్y ూ్‌బసy సంభందించి పురోగతిని సమీక్షించారు. వాయు కాలుష్యం తగ్గించేందుకు అవసరమైన ప్రతిపాదనలను ఎన్‌సిఎపి నిధులతో చేపట్టుట గురించి సమీక్షించారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ డి.ఎస్.పి, ఈ.ఈ పొల్యూషన్ అండ్ కంట్రోల్ బోర్డు, సంపత్ కుమార్ ఎస్.ఈ, సంజరు ఈ.ఈ, సురేష్ డి.ఈ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.










