విద్యార్థిని అభినందిస్తున్న కళాశాల యాజమాన్యం
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్ : విజయవాడ కెఎల్ యూనివర్శిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీస్ స్టేట్ యూత్ ఫెస్టివల్-2022 కార్యక్రమంలో విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల ఇఇఇ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఉష గ్రూపు చర్చల్లో ద్వితీయ స్థానాన్ని పొందారు. ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల సెక్రెటరీ, చైర్మన్ ఆర్.రామ్మోహన్‌రెడ్డి, కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎస్.రామలింగారెడ్డి గెలుపొందిన విద్యార్థిని అభినందించారు. వివిధ విభాగాల హెచ్‌ఒడిలు, అధ్యాపక బృందం విద్యార్థిని ప్రశంసించినారు.










