ఫొటో : యానాదిశెట్టి ని పరామర్శిస్తున్న సిపిఎం నాయకులు
గ్రంథికి సిపిఎం నాయకుల పరామర్శ
ప్రజాశక్తి-కావలి : అనారోగ్య కారణాల వల్ల ప్రస్తుతం ఇంటికే పరిమితమైన మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ ఎఎంసి చైర్మన్, టిడిపి పట్టణ అధ్యక్షులు గ్రంధి యానాది శెట్టిని మంగళవారం ఆయన ఇంటి వద్ద సిపిఎం పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య పట్టణ కమిటీ సభ్యులు ఎస్.వెంకయ్య, జి.మధుసూదన్‌రావు, వై.కృష్ణమోహన్, పి.పెంచల నరసింహంలు కలిసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కొంతసేపు గత, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను నెమరు వేసుకున్నారు. అనంతరం ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని యానాదిశెట్టిని కోరారు.










