గ్రంథాలయాలతో యువతకు విజ్ఞానం
ప్రజాశక్తి-బిట్రగుంట : విద్యార్థులు విజ్ఞానం పెంచుకునేందుకు గ్రంథాలయం ఎంతో అవసరమని రామచంద్రారెడ్డి హాస్పిటల్ ప్రముఖ సీనియర్ వైద్యులు ఎంవి రమణయ్య పేర్కొన్నారు. మండలంలోని సిపిఎం కార్యాలయంలో ఆదివారం గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంవిరమణయ్య పాల్గొని గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత నిస్సహాయతను కోల్పోకుండా అన్ని రంగాల్లోనూ ముందుండాలని, ప్రభుత్వ ఉద్యోగ రాత పరీక్షలు నెగ్గేందుకు గ్రంథాలయం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా మండల సిపిఎం కార్యదర్శి తుమ్మల వెంకయ్య, సిఐటియు మండల కార్యదర్శి చల్లా నరహరి, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు టి.మాల్యాద్రి, డాక్టర్ ఆనంద్ సాగర్ మాట్లాడారు. మండలంలో నిరుద్యోగ యువత సిపిఎం కార్యాలయంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు గ్రంథాలయం తెరిచి ఉంటుందని, ఈ అవకాశాన్ని నిరుద్యోగులు ఉపయోగించుకొని ప్రభుత్వ ఉద్యోగాల్లో పరీక్షల్లో ఉత్తీర్ణలు అవ్వాలని కోరారు. కార్యక్రమంలో నార్త్ ఆములురు చైల్డ్ ఆశ్రం నిర్వాహకులు రామచంద్ర శరత్ బాపూజీ, సిపిఎం నాయకులు ఎన్.రామయ్య, పొట్లూరి.శ్రీనివాసులు, విశ్వనాథరావుపేట ఎస్‌ఆర్‌కె స్కూల్ కరస్పాండెంట్ జి.హరిబాబు, జూనియర్ కాలేజ్ తెలుగు లెక్చరర్ వేదవతి, చిలకపాటి వెంకయ్య రైల్వే విశ్రాంతి అధికారి నెల్లూరు, సిపిఎం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.










