ప్రజాశక్తి-కాకినాడ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో అన్ని గ్రంథాలయాల్లో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించనున్నట్టు కలెక్టరు కృతికా శుక్లా తెలిపారు. శుక్రవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కృతికా శుక్లా గ్రంథాలయ అధికారులతో కలిసి 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. గ్రంథాలయ నిర్వాహకులందరూ ఈ వారోత్సవాలను సక్రమంగా నిర్వహించడం ద్వారా ఎక్కువ మంది పాఠకులు గ్రంథాలయాలకు వచ్చేలా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్ తదితర పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి విఎల్‌ఎన్‌ఎస్‌వి.ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ ఎల్.వెంకటేశ్వరరావు, డిప్యూటీ లైబ్రేరియన్ కె.కిషోర్, లైబ్రేరియన్ ఎం.శ్రీనివాసరావు, జిల్లా కేంద్ర గ్రంథాలయ సిబ్బంది సలాది రాజు, డి.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.