Jul 11,2021 13:36

మైసూరు (కర్నాటక) : అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిస్సహాయస్థితిలో ఉన్న ఓ యువతి (30) పై కామాంధుడు అత్యాచారం చేసిన ఘటన మైసూర్‌ కెఆర్‌ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి కెఆర్‌ ఆస్పత్రి కిటికీ గ్రిల్స్‌ విరగ్గొట్టి గదిలోకి చొరబడిన కామాంధుడు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నిస్సహాయ యువతిపై అత్యాచారం చేసి పారిపోయాడు. ఈ విషయాన్ని ఆమె బంధువులు వైద్యుల దృష్టికి తీసుకువచ్చారు. ఆస్పత్రికి చెడ్డపేరు వస్తుందని దాచిపెట్టాలని డాక్టర్లు యత్నించినట్లు బంధువులు తెలిపారు. మానవ హక్కుల సేవా సమితి సభ్యులు ఈ విషయాన్ని తెలుసుకుని వైద్యులను ప్రశ్నించగా సమాధానం చెప్పలేదు. ఎక్కడా బయట చెప్పొద్దని ఆస్పత్రి సిబ్బందిని వైద్యులు బెదిరించినట్లు తెలుస్తోంది. ఘటనా సమయంలో అక్కడే విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది పారిపోయారు.