Jul 08,2022 22:33

ప్రజాశక్తి-జగ్గయ్యపేట రూరల్‌: మండలంలోని గరికపాడు వ్యవసాయ పరిశోధన సంస్థలో శుక్రవారం రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్రీవాస్‌ నుపూర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయభారతి మాట్లాడుతూ వ్యవసాయ శాఖలో అమలవుతున్నటువంటి అన్ని పథకాల గురించి వివరించారు. పచ్చిరొట్టె విత్తనాలు 50 శాతం రాయితీపై రైతులకు అందిస్తున్నామని తెలిపారు. రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ, ఉద్యానవన సహాయకులు అందుబాటులో ఉన్నారని కాబట్టి ప్రతి రైతు తప్పనిసరిగా తమ పంటలను ఈ పంట యాప్‌ ద్వారా పంట నమోదు చేసుకోవాలని, తద్వారా వ్యవసాయ శాఖ ద్వారా అందేటటువంటి అన్ని పథకాలను అర్హత కలుగుతాయని తెలిపారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్రీవాస్‌ నూపుర్‌ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలను కొనుగోలు కేంద్రాలుగా రైతులుకు అందుబాటులో ఉంచామని, రైతులు ధాన్యం మద్దతు ధరకు తమ పంటను అమ్ముకోవచ్చని తెలిపారు. అపరాలు, పత్తి, పసుపు తదితర పంట ఉత్పత్తులు కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. వైయస్సార్‌ పొలంబడి ద్వారా ఆధునిక పంట యాజమాన్య పద్ధతులు క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా రైతులతో సొంతంగా చేయించి వారికి పంటల సాగులో అనుభవాగ్నులైన వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా సలహాలు, సూచనలు అందజేస్తున్నమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి బాలాజీ కుమార్‌, గరికపాడు కషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్‌ వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు డైరెక్టర్‌ సుభాని పశుసంవర్ధన్‌ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ కె వెంకటేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ డిడి వెంకటేశ్వరరావు, జగ్గయ్యపేట వ్యవసాయ శాఖ ఏడిఏ శ్రీనివాసరావు పాల్గొన్నారు.