Jun 24,2023 21:21

మాట్లాడుతున్న కలెక్టర

మాట్లాడుతున్న కలెక్టర
గ్రీవెన్స్‌లకు సత్వరమే పరిష్కారం
ప్రజాశక్తి-నెల్లూరు:జగనన్న కు చెబుదాం కార్యక్రమంలో వచ్చే గ్రీవెన్స్‌ లను సత్వరం పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ యం. హరి నారాయణన్‌ పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె ఎస్‌ జవహర్‌ రెడ్డి శనివారం ఉదయం వెలగపూడి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి భూ హక్కు, రీ సర్వే, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణాల పురోగతి, జగనన్నకు చెబుదాం తదితర అంశాలపై సమీక్షించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌ కు కలెక్టరేట్‌ లోని తిక్కన ప్రాంగణం నుంచి కలెక్టర్‌ యం. హరి నారాయణన్‌ పాల్గొని, జిల్లాలో అమలు జరుగుచున్న రీ సర్వే , ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణాల పురోగతి, జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమలు వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు.
జిల్లాలో జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి సంబంధించి ఎక్కువ సంఖ్యలో రెవెన్యూ, పంచాయతీ రాజ్‌, విద్యుత్‌, పురపాలక శాఖ, హౌం శాఖలకు సంబందించిన గ్రీవెన్స్‌ వస్తున్నాయని, వీటి పరిష్కారానికి ఆయా శాఖల అధికారులను నోడల్‌ అధికారులుగా నియమించి, వచ్చిన గ్రీవెన్స్‌ కు సంబంధించి ప్రతి రోజు ఆయా శాఖల అధికారులతో సమీక్షిస్తూ నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రీ ఓపెన్‌ అయిన గ్రీవెన్స్‌ పై ప్రత్యేక దష్టి సారించి నాణ్యతతో గ్రీవెన్స్‌ పరిష్కారికి కషి చేస్తున్నట్లు వివరించారు. జిల్లాలో జరుగుచున్న రీ సర్వే ప్రక్రియను ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా పూర్తి చేసేలా అన్నీ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌, సిఎస్‌ కు వివరించారు. జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాల కింద చేపట్టిన నూతన గ్రామ/వార్డు సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వై.ఎస్‌.ఆర్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ ల నిర్మాణాలను ప్రభుత్వం సూచించిన నిర్ణీత గడువులోగా పూర్తిచేయుటకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్‌, సి.ఎస్‌. కు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. కూర్మనాథ్‌, కందుకూరు సబ్‌ కలెక్టర్‌ శోభిక, అసిస్టెంట్‌ కలెక్టర్‌ విద్యాధరి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, నెల్లూరు, కావలి, ఆత్మకూరు ఆర్‌.డి.ఓ లు మలోల, శీనా నాయక్‌, కరుణకుమారి, పంచాయతీ రాజ్‌, ఆర్‌.డబ్ల్యూ. ఎస్‌., ఆర్‌ అండ్‌ బి ఎస్‌.ఈ లు అశోక్‌ కుమార్‌, రంగవరప్రసాద్‌, గంగాధర్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పెంచలయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుధాకర్‌ రాజు, డ్వామా పిడి వెంకట రావు, సిపిఓ ఎస్‌.రాజు, సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏ డి హనుమాన్‌ ప్రసాద్‌ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.