గ్రిగ్ టోర్నమెంట్స్ ప్రారంభం
ప్రజాశక్తి - కావలి : స్థానిక జిల్లాపరిషత్ హైస్కూలు గ్రౌండ్‌లో శుక్రవారం 98వ గ్రిగ్ మెమోరియల్ టోర్నమెంట్‌ను కావలి ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయపతాకాన్ని ఎగురవేశారు. 800 మీటర్ల పరుగుపందేలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి జడ్‌పి గ్రౌండ్స్‌లో 98వ గ్రిగ్ మెమోరియల్ టోర్నమెంట్స్‌లో కావలి, బోగోలు, దగదర్తి, అల్లూరు మండలాల విద్యార్థులకు క్రీడలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు. విద్యతోపాటు విద్యార్థులు క్రీడల్లోకూడా పాల్గొని, కావలి నియోజకవర్గానికి మంచిపేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. మొన్న జరిగిన జగనన్న క్రీగల్లో కావలి నియోజకవర్గానికి 4వ స్థానం రావడం తనకు గర్వకారణమన్నారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, కుందుర్తి శ్రీనివాసులు, కుందుర్తి కామరాజు (సురేష్) తిరువీధి ప్రసాద్, పుత్తూరు నాగాచారి, జె.బి.కళాశాల పీ.డీ. పి.ప్రసాద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.










