May 24,2023 21:11

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి :జిల్లాలోని గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు తప్పనిసరిగా సంపూర్ణ పోషకాహారం అందించాలని కలెక్టర్‌ గిరీష అంగన్వాడీలు, సిడిపిఒలు, సూపర్‌వైజర్లు, వర్కర్లు, ఆయాలను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని విసి హాలు నుంచి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అమలు చేస్తున్న పథకాల అమలు, వాటి ప్రగతి తదితరాలపై అంగన్వాడీ కేంద్రాల సిబ్బందితో విసి ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో అంగన్వాడీల కేంద్రాల బలోపేతానికి సిబ్బంది అందరూ చిత్తశుద్ధితో బాధ్యతాయుతంగా కషి చేయాలన్నారు. 400 నుంచి 500 మంది జనాభా ఉన్న హాబిటేషన్లో అంగన్వాడీ కేంద్రాలు లేకుంటే వెంటనే వివరాలు పంపించాలన్నారు. మూడు ఫార్మాట్లను నిర్దేశించామని కొత్త అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాల్సిన ప్రదేశం, గతంలో ఉండి ప్రస్తుతం మూసివేసిన అంగన్వాడీ కేంద్రం, ఒక క్లస్టర్‌ నుంచి లేదా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్పు చేసిన అంగన్వాడీ కేంద్రం వివరాలను మండల వారీగా, సెక్టార్‌ వారీగా సదరు ఫార్మేట్లలో సోమవారం లోపు జిల్లా కేంద్రానికి పంపాలన్నారు. సదరు వివరాలను సమర్పించడంలో సిడిపిఓలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. సంపూర్ణ పోషణలో భాగంగా గుడ్లు, పాలను సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. తీవ్ర రక్తహీనత కలిగిన వారికి అంగన్వాడీ కేంద్రాలలో అందజేసే ఐరన్‌ పోలిక్‌ యాసిడ్‌ మాత్రలను లబ్ధిదా రులు తీసుకెళ్లినా కూడా సరిగా వాడడం లేదని ద ష్టికి వచ్చింది. కాబట్టి తీవ్ర రక్తహీనత ఉన్నవారు అంగన్వాడీ కేంద్రంలోనే సదరు ట్యాబ్లెట్‌ వేసుకునేలా చూడాలి లేదా వారి ఇంటికి వెళ్లి ప్రతిరోజు మాత్ర వేసుకుంటున్నారో లేదో స్వయంగా విచారణ చేయాలని వర్కర్లు, ఆయాలను ఆదేశించారు. బరువు తక్కువ ఉన్న పిల్లల రిపోర్టు 80 శాతం మాత్రమే నమోదు జరిగిందని వంద శాతం నమోదు జరిగేలా దష్టి పెట్టాలన్నారు. బరువు తక్కువ ఉన్న పిల్లలు, స్టెంటేడ్‌ పిల్లలకు కూడా అంగన్వాడీ కేంద్రాలలో ఆహారం తినేలా చూడాలని మొత్తం క్లస్టర్‌ పరిధిలో బరువు తక్కువ ఉన్న పిల్లలందరికీ సరైన పోషకాహారం తీసుకునేలా వర్కర్లు కషి చేయాలన్నారు. పిల్లలకు వందశాతం ఆధార్‌ సీడింగ్‌ చేయించాలని, ప్రతి సచివాలయానికి నెలకు రెండుసార్లు డాక్టర్లు సందర్శించడం జరుగుతుందని ఆ సమయంలో ఆరోగ్యం సరిగా లేని వారు, స్టెంటెడ్‌ పిల్లలను డాక్టర్లకు చూపించేలా క షి చేయాలన్నారు. వైయస్సార్‌ కిట్ల సరఫరా, టిఫికేషన్‌ ను త్వరగా పూర్తి చేయాలన్నారు. సంపూర్ణ పోషణ, పోషణ ట్రాకర్‌ ఆప్‌లలో కూడా ఎప్పటికప్పుడు వివరాలను అప్డేట్‌ చేయాలని చెప్పారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బాలామతం, పాలసరఫరా, అంగన్వాడీ స్కూల్‌ కన్స్ట్రక్షన్స్‌ అంశాలపై సమీక్షించారు. నాడు నేడు ద్వారా చేపట్టిన నూతన అంగన్వాడి పాఠశాలల నిర్మాణంలో వారం వారం ప్రగతి కనిపించాలన్నారు. అనంతరం సిడిపిఒలు, సూపర్వైజర్ల పర్యటనలపై కూడా సమీక్షించి తగు సూచనలు జారీ చేశారు. సమావేశంలో ఐసిడిఎస్‌ ఇన్‌ఛార్జి పీడీ ధనలక్ష్మి, సిడిపిఒలు, సూపర్వైజర్లు, వర్కర్లు, ఆయాలు పాల్గొన్నారు.