Dec 24,2022 22:07

సమావేశంలో మాట్లాడుతున్న సామకోటి ఆదినారాయణ

ప్రజాశక్తి బుక్కపట్నం : గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రోత్సహించేందుకే జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సామకోటి ఆదినారాయణ తెలిపారు శనివారం మండల కేంద్రంలోని బాలురపాఠశాల ఆవరణంలో కబడ్డీ క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ నటరాజ్‌, పుంగనూరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ వెంకటేష్‌, మధుసూదన్‌, పిఇటిలు నాగరాజు, వెంకటేష్‌, రామకృష్ణ, టిడిపి నాయకులు సామకోటి ఈశ్వరయ్య, బేకరీ నాయుడు, గొర్లకృష్ణ తదితరులు పాల్గొన్నారు..