రాయచోటి టౌన్ :మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కరింపచేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ గిరీష అన్నారు. 74వ గణతంత్ర వేడుకలు జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీలు ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సాయుధ బలగాలు కవాతు నిర్వహించాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ సందేశాన్ని కలెక్టర్ వినిపించారు. జాతిపిత మహాత్మా గాంధీతో పాటు ఎందరో అమర వీరులు చేసిన త్యాగ ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం లభించిందని పేర్కొన్నారు. ఆ మహనీయులను స్మరిస్తూ వారందరికీ ఘననివాళి అర్పిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అన్నమయ్య జిల్లా అభివద్ధి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ప్రజా ప్రతినిధులు కషి చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని జిల్లా వార్షిక వర్షపాతం 673.8 మిల్లీమీటర్లు అయినప్పటికీ 760.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని పేర్కొన్నారు. జిల్లాలోని శ్రీనివాసపురం, అడవిపల్లి, వెలిగల్లు, బహుద, పెద్దూరు, పింఛా, ఝరికోన ప్రాజెక్టులలో సామర్థ్యానికి మేరకు నీటి నిల్వలు ఉన్నాయని రైతులకు వైఎస్‌ఆర్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయంగా 2022-23 సంవత్సరానికి గాను రైతు ఖాతాలలో రూ.150 కోట్లు, సీఎం కిసాన్ పథకంలో రూ. 76 కోట్లు జమ చేశామని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, జిల్లాకు కేటాయించిన నిధుల గురించి సమగ్రంగా వివరించారు. అనంతరం జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను కలెక్టర్, ఎస్‌పి, జెసి శాలువాలు కప్పి సత్కరించారు. కార్యక్రమంలో జెసి తమీమ్ అన్సారీయా, ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమరనాధరెడ్డి, శాసనమండలి మండలి వైస్‌చైర్‌పర్సన్ జకియా ఖానం, జిల్లా స్థాయి అధికారులు, పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు.
అలరించిన శకటాలు..: గణతంత్ర వేడుకల్లో భాగంగా జిల్లాలోని వివిధ శాఖల అధికారులు ఏర్పాటు చేసిన శకటాలు ఆకట్టుకున్నాయి. ఇందులో పంచాయితీ రాజ్ శాఖ శకటానికి మొదటి బహుమతి, మున్సిపల్ శాఖ శకటానికి రెండో బహుమతి, డ్వామా శకటానికి మూడో బహుమతి లభించాయి. వివిధ సాంస్కతిక కార్యక్రమాలలో పాల్గొన్న కలికిరి సైనిక్ స్కూల్‌కు మొదటి బహుమతి, రాయచోటి దివ్య తేజ స్కూల్‌కు రెండవ బహుమతి లభించాయి. జిల్లాలోని వివిధ శాఖల జిల్లా అధికారులకు ప్రశంసా పత్రాలను అందించారు.పోలీసుల










