ప్రజాశక్తి-నందిగామ
మండలంలోని లింగాలపాడు గ్రామంలో రూ.40 లక్షల అంచనా విలువతో నూతనంగా నిర్మించనున్న గ్రామ సచివాలయ భవన నిర్మాణ పనులకు నందిగామ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు మెరుగైన పాలన అందించడమే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి గత ప్రభుత్వం మోసం చేస్తే అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొల్లినేని పద్మజ , ఎంపీపీ అరిగెల సుందరమ్మ ,వైస్ ఎంపీపీ ఆకుల రంగా, జడ్పిటిసి గాదెల బాబు, మండల పార్టీ అధ్యక్షులు నెలకుదిటి శివ నాగేశ్వరరావు పాల్గొన్నారు .










