Feb 14,2022 18:50

కాన్పూర్‌ :  జాతీయ స్థాయిలో తమ పార్టీని విస్తరించేందుకు యత్నిస్తున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టిఎంసి)పై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. గోవాలో హిందూ ఓట్లను చీల్చేందుకు టిఎంసి యత్నిస్తోందని, ఇది ఆ పార్టీ బహిరంగ వాదన అని అన్నారు. ఇటీవల టిఎంసి గోవా ఇన్‌చార్జ్‌ మహువా మొయిత్రా మాట్లాడుతూ.. సుధీన్‌ ధవలికర్‌ నేతృత్వంలోని మహారాష్ట్ర వాది గోమంతక్‌ పార్టీ (ఎంజిపి)తో పొత్తు కారణంగా రాష్ట్రంలో హిందూ ఓట్లు చీలుతాయని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. రెండు పార్టీల సంస్కృతులు సరిపోలవని, రెండూ భిన్నమైన సిద్ధాంతాలు కలవని అన్నారు. యుపిలోని కాన్పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. జయంత్‌ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌దళ్‌తో సమాజ్‌వాది పార్టీపొత్తుపై స్పందింస్తూ.. అఖిలేష్‌ యాదవ్‌కి చెందిన సమాజ్‌వాది పార్టీ పగలు , రాత్రి తేడా లేకుండా యుపిని కొల్లగొడుతుతోందని అన్నారు. వారు మాఫియాతో చేతులు కలిపారని, ఈ ఘోర పరివార్వాడి (రాజవంశీయులు) తమ కుటుంబాలకు వివిధ ప్రాంతాలను పంచుతుండగా.. వీరు ప్రతినగరంలో కాన్పూర్‌ మాఫియాను గంజ్‌ మొహల్లాగా మారుస్తున్నారని అన్నారు. ప్రతిఎన్నికల్లోనూ కొత్త భాగస్వామ్య పార్టీతో వస్తారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓటమి పాలైతే.. భాగస్వామ్యులను నిందిస్తారని అన్నారు.