Mar 10,2022 09:41

పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆసక్తి రేపుతోంది. బిజెపి, కాంగ్రెస్‌ హోరాహోరీగా తలపడుతున్నాయి. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు గానూ ప్రస్తుతం బిజెపి 21 స్థానాలతో ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ.. కాంగ్రెస్‌ 11 స్థానాల్లో దూసుకెళుతోంది. తొలిసారి బరిలోకి దిగిన తృణమూల్‌ 5 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుండగా.. ఆప్‌ ఒక స్థానానికే పరిమితమౌతోంది. మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ లేకుండా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఆయన కుమారుడు ఉత్పల్‌ బిజెపి సీటు ఇవ్వకపోవడంతో... పనాజీ నుండి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఉత్పల్‌ ప్రస్తుతం ఆధిక్యం దిశగా దూసుకెళుతున్నారు.  పూర్తి ఫలితాలు వెలువడే వరకు గోవాలో ఏం జరగుతుందో చెప్పలేని పరిస్థితి. హంగ్ ఏర్పడితే..  బాల్ టిఎంసి కోర్టులోకి రానుంది.