స్టాకును పరిశీలిస్తున్న సబ్‌కలెక్టర్
ప్రజాశక్తి - మడకశిర : పట్టణంలోని ప్రభుత్వ సివిల్ సప్లై గోదామును పెనుగొండ సబ్ కలెక్టర్ కార్తీక్ శుక్రవారం తనిఖీ చేశారు. గోదాములో ఉన్న బియ్యం, పంచదార, కందిపప్పు బస్తాల నికర నిలువను, స్టాక్ రిజిస్టరును పరిశీలించారు. తూకాల్లో తేడా వుంటున్నట్లు రేషన్ కార్డుదారుల నుంచి ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఆయన గోదాములను తనిఖీ చేసి పలుబస్తాలను తుకాలను వేయించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఆనంద్ కుమార్, సిఎస్‌డిటి హారతి తదితరులు పాల్గొన్నారు.










