ప్రజాశక్తి - రాయచోటి: 74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించి విజయవంతం చేయాలని కలెక్టర్ గిరీషా పిఎస్ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్‌పితో కలసి గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్నమయ్య నూతన జిల్లాలో గత ఏడాది ఆగస్టు 15న మొదటిసారిగా నిర్వహించిన భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అధికారులందరూ సమన్వయంతో బాగా నిర్వహించారని, అలాగే ఈసారి కూడా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బాధ్యతాయుతంగా కషి చేయాలన్నారు. వేడుకలలో అధికారులకు కేటాయించిన విధులు పక్కాగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రభుత్వ అభివద్ధి కార్యక్రమాలను ప్రతిబింబిస్తూ వివిధ శాఖలు ఏర్పాటు చేసే శకటాల ప్రదర్శన ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకునేలా ఉండాలన్నారు. అలాగే ఆయా శాఖలు ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ జెండా ఎగరవేయుట, వేదిక అలంకరణ, సీటింగ్ ఏర్పాట్లు, తాగునీటి ఏర్పాట్లు, సాంస్కతిక కార్యక్రమాల నిర్వహణ, ఉద్యోగులకు ప్రశంసా పత్రాల జారీ, ప్రోటోకాల్ మేరకు ఆహ్వాన పత్రికలు పంపిణీ తదితరంశాలలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి పలు సూచనలు జారీ చేశారు. రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలల నుంచి వచ్చే విద్యార్థులకు స్నాక్స్, వాటర్ బాటిల్స్ ఇవ్వాలన్నారు. 26న ప్రతి సచివాలయంలో జాతీయ జెండా ఎగురవేసేలా తగు ఉత్తర్వులు జారీ చేయాలని డిఆర్‌ఒకు సూచించారు. అధికారులందరూ సమన్వయ స్ఫూర్తితో గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఎస్‌పి ఆకాంక్షించారు. స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో గత ఆగస్టులో నిర్వహించిన వేడుకల అనుభవాలను దష్టిలో ఉంచుకొని ఈసారి మరింత ఘనంగా వేడుకలను నిర్వహించేందుకు కషి చేయాలన్నారు. పోలీస్ శాఖ పరంగా తీసుకోవలసిన అన్ని చర్యలను పట్టిష్టవంతంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఓ సత్యనారాయణ, ఆర్డీవో రంగస్వామి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.










