Jan 11,2023 20:37

ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌

ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌
గణతంత్ర దినోత్సవ వేడుకలకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు
నెల్లూరు:ఈనెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని కలెక్టర్‌ కెవిఎన్‌ చక్రధర్‌ బాబు అధికారులను ఆదేశించారు.బుధవారం నగరంలోని జెడ్‌పి సమావేశ మందిరంలో కలెక్టర్‌ సంయుక్త కలెక్టర్‌ రోనంకి కూర్మానాద్‌, డిఆర్‌ఓ వెంకటనారాయణమ్మ, ఏఎస్‌పి శ్రీనివాసరావు లతో కలిసి గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కొంతమంది జిల్లా అధికారులు సమావేశానికి సకాలంలో రాకపోవడంతో కలెక్టర్‌ కొంత అసంతప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా సంస్థల్లో జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించేలా చర్యలు చేపట్టాలని సూచించారు
.జాతీయ పతాకం వినియోగంలో తప్పనిసరిగా నియమాలను పాటించేలా జాగ్రత్త వహించాలన్నారు.డివిజన్‌, మండల స్థాయిల్లో ఉదయం 7:30 లోగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలన్నారు. జిల్లా స్థాయిలో ఉదయం 8:30 గంటలు పోలీస్‌ పేరెడ్‌ మైదానానికి హాజరై వేడుకలు జరుపుకోవలసి ఉంటుందన్నారు.ఈ వేడుకలలో 10 సంవత్సరాల లోపు పిల్లలను, 60 సంవత్సరాల పైబడి వయస్సు కలిగిన వద్ధులు లేకుండా కోవిడ్‌ నిబంధనలు విధిగా పాటించేలా చూడాలన్నారు.అతిథులుగా వస్తున్న స్వాతంత్ర సమర యోధులు వారి కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా తీసుకువచ్చి జాగ్రత్తగా వారి నివాసాలకు చేర్చే బాధ్యతను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ప్రోటోకాల్‌ ప్రకారం ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు జిల్లా ప్రముఖులకు ఆహ్వానాలు పంపాలన్నారు.పోలీస్‌ పేరెడ్‌ మైదానంలో సోఫాలు కుర్చీలు ఎటువంటి ఫిర్యాదులు రాకుండా సజావుగా ఏర్పాటు చేయాలన్నారు.పోలీస్‌ పేరెడ్‌ మైదానంతో పాటు శ్రీ వెంకటేశ్వర కస్తూరిబా కళాక్షేత్రంలలో జాతీయ సమైక్యత తెలుగుదనాన్ని ప్రతిబింబించేలా సాంస్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.వేడుకలు జరిగే పోలీస్‌ కవాతు మైదానము, శ్రీ వెంకటేశ్వర కస్తూరిబా కళాక్షేత్రం పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు సజావుగా ఉండేలా చూడాలన్నారు. వేడుకలకు వచ్చే ఆహుతులు, ప్రజలు, విద్యార్థులకు మంచినీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.జిల్లా అభివద్ధిని చాటి చెప్పే విధంగా వివిధ ప్రభుత్వ శాఖల శకటాలను, ప్రదర్శనశాలలను ఏర్పాటు చేయాలన్నారు.గహ నిర్మాణం, మనబడి- నాడు నేడు కార్యక్రమాల అమలులో విశేష సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేయుటకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో బి చిరంజీవి, డ్వామా ఐసిడిఎస్‌, మెప్మా పిడిలు శ్రీ వెంకటరావు, సౌజన్య, రవీంద్ర, ఐటీడీఏ పీవో మందా రాణి, డిటిసి బి చందర్‌, డిఎస్‌ఓ వెంకటేశ్వర్లు, సిపిఓ సాలెం రాజు, నగర ఉప కమిషనర్‌ చెన్నుడు, డీ ఈవో సుబ్బారావు ,ఆర్డబ్ల్యూఎస్‌ ఎస్‌.ఈ రంగ వరప్రసాద్‌, సిగల్‌ సీఈవో పుల్లయ్య, డి ఎం అండ్‌ హెచ్‌ ఓ డాక్టర్‌ పెంచలయ్య ప్రజా రవాణా అధికారి శేషయ్య తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు