పుట్టపర్తి రూరల్ : మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టాలని తెలుగుయువత నాయకులు కోరారు. ఈ మేరకు వారు శ్రీ సత్య సాయి జిల్లా అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ప్రసాద్‌కు సోమవారం ఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఉద్యోగ కల్పనలో యువతను ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారని హామీ ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోయాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి అంబులెన్స్ రమేష్, పుట్టపర్తి నియోజకవర్గ అధ్యక్షులు ఓబుల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మనోహర్ మాల, జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, అసెంబ్లీ కమిటీ సభ్యులు సుధీర్, మధుసూదన్ రెడ్డి ,మహేష్ రెడ్డి, రాజేష్, శివప్రసాద్ రెడ్డి, మల్లికార్జున, నారేపల్లి రామచంద్ర, బీడుపల్లి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్ : పట్టణంలో నిషేదిత గంజాయిని ఆక్రమంగా రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలుగుయువత రాష్ట్ర అధికారప్రతినిధి చిన్నూరు విజరు చౌదరి కోరారు. ఈ మేరకు సోమవారం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ నియోజకవర్గం అధికార ప్రతినిది తొగట అనిల్, నియోజకవర్గ ఉపాధ్యక్షులు సంగాలబాలు, నాయకులు అమరా, సుధాకర్‌నాయుడు, మిడతల యుగంధర్, పవన్‌రెడ్డి, బొంత చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.










