లక్కిరెడ్డిపల్లి : ఈ నెల 21,22 తేదీలలో నిర్వహించబోయే గంగమ్మ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్‌పి హర్షవర్దన్‌రాజు పేర్కొన్నారు. బుధవారం గంగమ్మ జాతర ఏర్పాట్లు పరిశీలించారు. ఆర్‌టిసి బస్సులు, డిపో ఏర్పాటు, వాహనాల పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు రాయచోటి, పులివెందుల, కడప డిపోల నుంచి జాతరకు వచ్చే బస్సుల రూట్ మ్యాప్‌ను ఆయన పరిశీలించారు. జాతరలో మద్యం విక్రయించిన కఠిన చర్యలు తప్పవని అన్నారు. ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలన్నారు రెండు రోజులపాటు నిర్వహించే జాతరలో అశ్లీల నృత్య ప్రదర్శనలు చేయరాదని సూచించారు. చాందిని బండ్లతో వచ్చే భక్తులకు అశ్లీల నత్య జాతరలో అన్ని వసతులు ఏర్పాటు చేయాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఆయన వెంట సిఐ వరప్రసాద్, ఎస్‌ఐ వినోద్‌కుమార్, ఆలయ చైర్మన్ నరసింహారెడ్డి, కార్యనిర్వహణ అధికారి రవీంద్రరాజు, నలంద స్కూల్ కరస్పాండెంట్ బాలసుబ్రమణ్యం , హెడ్ కానిస్టేబుల్ రాంప్రసాద్ పాల్గొన్నారు










