Oct 19,2022 13:25

ప్రజాశక్తి-రెడ్డిగూడెం : ఎన్టీఆర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో బుధవారం నాడు రెడ్డిగూడెం హైస్కూల్ లో అండర్ 14/17 బాలబారికలకు ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను వైస్ ఎంపీపీ చాట్ల రాబర్ట్, రెడ్డిగూడెం ఎంపీటీసీ సభ్యులు కుప్పిరెడ్డి వరప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ చాట్ల రాబర్ట్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరిక దారుణ్యానికి ఉపయోగపడతాయని, అలాగే భవిష్యత్తులో ఈ సర్టిఫికెట్ కూడా ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ  ఈ పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ భాస్కరరావు, స్కూల్ కమిటీ చైర్మన్ భీమయ్య పాల్గొన్నారు