Feb 04,2023 20:00

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు

ఏజెంట్ల సమావేశంలో ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు
ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ : అమాయక ప్రజల్ని డబ్బు ఆశ చూపించి గల్ఫ్‌ దేశాలలో ఇబ్బంది పెట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు అన్నారు. శనివారం పోలీస్‌ కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న గల్ఫ్‌ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా నలుమూలాల నుండి జీవనోపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళుతున్నారని పేర్కొన్నారు. అక్కడ వివిధ కారణాలతో ఇబ్బంది పడడం తరచూ జరుగుతోందని చెప్పారు. అక్కడ ఇబ్బంది పడ్డ వాళ్లు క్షేమంగా ఇంటికి చేరే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేదానిపై సమావేశం నిర్వహించామని తెలిపారు. గల్ఫ్‌ బాధితుల కష్టాలపై ఏజెంట్లతో ముఖాముఖి నిర్వహించారు. గల్ఫ్‌ బాధితులు ఎదుర్కొన్న కష్టాలను ఏజెంట్ల ఏదుట మాట్లాడించారు. వాటి పరిష్కారం ప్రణాళికలు తయారు చేస్తామన్నారు. జిల్లా కేంద్రమైన రాయచోటి రికగ్నైజ్‌ ఐడెంటిటి కలిగిన ఏజెంట్లు కేవలం ముగ్గురే వున్నట్లు గుర్తించామని తెలిపారు. 300 మంది దళారులు ఉన్నట్లు వీసాతో పాటు రూ.లక్షలు పంపించే సేట్‌లు ఆకామాలు కొట్టించండంలో పూర్తి భాద్యత తమదే అంటూ ఏజెంట్లు చెబుతున్నారని పేర్కొన్నారు. సేట్‌ల దగ్గర పనులు చేయలేక మా వారిని వెనక్కి పిలిపించండి అంటూ ఒత్తిడి తేస్తారని, వాటికి పిసిసి, పాస్‌పోర్టు, మెడికల్‌, ఎయిర్‌ టికెట్‌ ఖర్చులు సెట్‌ ఇచ్చిన డబ్బులు ఉపయోగిస్తామని ఎన్‌ఆర్‌ఐ ఏజెంట్లు ఎస్‌పికి వివరించారు. వాపసు వస్తామంటే గల్ఫ్‌ సెట్‌ ఇచ్చిన డబ్బులు వాపసు అడుగుతారని, తామేదో తప్పు చేసినట్లు తమపై పోలీసులకు ఫిర్యాదు చేస్తారని వాపోయారు. గల్ఫ్‌ దేశాలలో ఇబ్బంది పడ్డ బాధితులతో ఏజెంట్స్‌ ఎదురుగా మాట్లాడించారు. రానున్న రోజుల్లో ప్రజల్లో అవగాహన కల్పించి పూర్తిస్థాయిలో బయటి దేశాలలో ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో డిఎస్‌పి శ్రీనివాస్‌రావు, ఎస్‌బి సిఐ సత్యనారాయణ, ఎస్‌ఐ మొహమ్మద్‌ రఫీ, సిబ్బంది, గల్ఫ్‌ ఏజెంట్లు పాల్గొన్నారు.