ఫొటో : మాట్లాడుతున్న జిల్లా రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య
గిట్టుబాటు ధర కల్పించాలి
ప్రజాశక్తి-సీతారామపురం : రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధర చట్టం తీసుకురావాలని జిల్లా రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని పాలెంగారిపల్లి గ్రామ వద్ద కల్లాలలో ఉన్న పంటను మొక్కజొన్న పంటను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాలలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర అందాల చట్టం తీసుకురావడానికి తీసుకురావాలన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని రైతులు ఈ సీజన్లో పండించిన మొక్కజొన్న మినుము సజ్జ వంటి పంటలు కళ్లల్లోకి వస్తుందన్నారు.










