Jun 05,2023 23:07

విజేత జట్టుకు ట్రోఫీని అందజేస్తున్న పరిటాల శ్రీరామ్‌

ప్రజాశక్తి - ధర్మవరం టౌన్‌ : ఏ క్రీడలోనైనా గెలుపోటములను సమానంగా తీసుకోవాలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాలశ్రీరామ్‌ పేర్కొన్నారు. పరిటాల రవీంద్ర మెమోరియల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాప్తాడు, ధర్మవరం సూపర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీ ఫైనల్‌ పోటీలు సోమవారం జరిగాయి. ఫైనల్‌లో మల్లెనిపల్లి, గొట్లూరు జట్లు తలపడగా గొట్లూరు జట్టు విజేతగా నిలిచింది. దీంతో గొట్లూరు జట్టుకు పరిటాల శ్రీరామ్‌ చేతులమీదుగా ట్రోఫీని అందజేశారు. అనంతరం ఆర్గనైజర్స్‌ పణికుమార్‌, రాంపురంశీన, కేశగాళ్ల శ్రీనివాసులు,చిన్నూరు విజరు చౌదరి, బొట్టుకిష్ట, శంకర, అమరాసుధాకర్‌, తోటవాసుదేవ, కామెంటరీ శ్రీనివాసులను సత్కరించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కమతంకాటమయ్య, చింతలపల్లి మహేశ్‌ చౌదరి, పురుషోత్తం గౌడ్‌, మేకలరామాంజినేయులు, నాగూర్‌ హుస్సేన్‌, బీమనేని ప్రసాద్‌నాయుడు, గోసల శ్రీరాములు, అత్తరహీంబాషా తదితరులు పాల్గొన్నారు