ప్రజాశక్తి - బత్తలపల్లి : క్రీడా పోటీల్లో గెలుపు, ఓటములను సమానంగా తీసుకున్నప్పుడే క్రీడా స్ఫూర్తిని చాటిన వారవుతారని మాజీ మంత్రి పరిటాల సునీత, టిడిపి రాష్ట్ర కార్యదర్శి గోనుగుంట్ల విజయకుమార్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని గంటాపురం గ్రామంలో నెల రోజులుగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్లో అశోక్ ఎలెవన్ జట్టు,సందీప్ ఎలివన్ జట్ల మధ్య ఫైనల్‌పొరు రసవత్తరంగా సాగింది. మొదటగా అశోక్ ఎలెవన్ జట్టు 151 పరుగు చేయగా, సందీప్ ఎలివన్ జట్టు 129 పరుగులు మాత్రమే చేసిఓడిపోయింది. గెలుపొందిన అశోక్ ఎలెవన్ జట్టుకు మాజీ మంత్రి పరిటాల సునీత, టిడిపి రాష్ట్ర కార్యదర్శి గోనుగుంట్ల విజయకుమార్ ట్రోపీలతోపాటు రూ, లక్ష రూపాయల నగదు, రన్నర్ జట్టు సందీప్ ఎలివన్ జట్టుకు ట్రోపీలతోపాటు రూ. 50 వేల రూపాయలు నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు అధ్యక్షులు చల్లా శ్రీనివాస్ నాయుడు, గంటాపురం జగ్గు, కన్వీనర్ నారాయణరెడ్డి, తాళ్లూరు సతీష్ కుమార్ చౌదరి, సురేంద్ర నాయుడు, గోనుగుంట్ల అమర్నాథ్ చౌదరి, సుబ్బరాయుడు, నెట్టెం రమణ తదితరులు పాల్గొన్నారు.










