Dec 22,2022 22:43

సమావేశంలో మాట్లాడుతున్న పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : ఎమ్మెల్సీ ఎన్నికలలో పిడిఎఫ్‌ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్సీ అభ్యర్థులు కత్తి నరసింహారెడ్డి, పోతుల నాగరాజు కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా స్థానిక ప్రెస్‌ క్లబ్‌లో ప్రజాసంఘాల కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ అభ్యర్థులు కత్తినరసింహారెడ్డి, పోతుల నాగరాజు, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌, కఐఎస్‌ఎఫ్‌ మాజీ జాతీయ అధ్యక్షుడు వేమయ్యయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లానాయకులు ఇంతియాజ్‌, ఏపీ చేనేత కార్మికసంఘం రాష్ట్ర అధ్యకులు పోలారామాంజినేయులు, జింకాచలపతి. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, సీపీఎం పట్టణ కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న, ఎఐటియుసి జిల్లాప్రధాన కార్యదర్శి బయన్న, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆయూబ్‌, జిల్లా సహాయ కార్యదర్శి జేవీరమణ, నాయకులు మహదేవ్‌, కుళాయప్ప నామాలనాగార్జున, పోతలయ్య తదితరులు పాల్గొన్నారు.