Jun 23,2023 21:52

ఫొటో : కార్యకర్తలతో ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి

'గడపగడపకు' విశేష స్పందన
ప్రజాశక్తి-విడవలూరు : ప్రజల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆదేశాలతో నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల వద్ద నుంచి విశేష స్పందన వస్తుందని ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విడవలూరు మండల పరిధిలోని మన్మధరావుపేట, జాన్‌పేటలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రతి గడపకు వెళ్లి ఇంట్లో వారిని పలకరిస్తూ వలంటీర్‌, సచివాలయ వ్యవస్థ ద్వారా వారి సమస్యలను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో పవన్‌కళ్యాణ్‌ వైసిపి ఎంఎల్‌ఎలపై అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతున్నారని తెలిపారు.
రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి పవన్‌ కళ్యాణ్‌ అని పార్టీ పేరు గానీ తెలియని వ్యక్తి వైసిపి ప్రభుత్వం గురించి మాట్లాడటం సరికాదన్నారు. తల.. తోకా.. లేకుండా మాట్లాడే వ్యక్తిని ఎర్రగడ్డలో చేర్పించాలని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో నల్లపరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డి, నల్లపరెడ్డి రంజిత్‌ కుమార్‌ రెడ్డి, మాజీ ఎఎంసి చైర్మన్‌ పుండ్ల అచ్యుత్‌ రెడ్డి, కాటంరెడ్డి నవీన్‌రెడ్డి, వైసిపి సీనియర్‌ నాయకుడు కొండూరు వెంకట సుబ్బారెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, గ్రామ సచివాలయ వ్యవస్థ, వలంటీర్‌ వ్యవస్థ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.