May 22,2023 21:57

ఫొటో : సంక్షేమ పథకాల కార్డును అందజేస్తున్న ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి

గడపగడపకు మన ప్రభుత్వం
ప్రజాశక్తి-అల్లూరు : మండలంలోని పల్లిపాడు గ్రామంలో సోమవారం కావలి ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన గ్రామానికి విచ్చేయడంతో ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి చేసిన మేలేమీ లేదని ఎద్దేవా చేశారు.
వైసిపి అధికారంలోకి వచ్చిన 4 ఏళ్లలో ఎంతో అభివృద్ధి జరిగిందని తెలియజేశారు. వలంటీర్లు ఉదయాన్నే వెళ్లి పింఛన్లు అందజేసి ప్రజల మన్నలను పొందుతున్నారని తెలియజేశారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ చంద్రశేఖర్‌, నగర పంచాయతీ కమిషనర్‌ ఫణికుమార్‌, ఎంపిపి దర్శిగుంట శశిరేఖ, వైసిపి నాయకులు దండా కృష్ణారెడ్డి, కోడూరు సాధక్‌ కుమార్‌ రెడ్డి, నీలం సాయికుమార్‌, చెంతాటి శ్రీనివాసులు తదితరులున్నారు.