ఫొటో : మేనిఫెస్టోను అందేస్తున్న ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్
గడపగడపకు మన ప్రభుత్వం
ప్రజాశక్తి బిట్రగుంట : బోగోలు మండలం శ్రీ వెంకటేశ్వరపాలెం గ్రామంలో మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పాల్గొని గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి సంబంధించిన సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి వీలైనంత త్వరలో పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో వైసిపి కన్వీనర్ మద్దిబోయిన వీరరఘు, ఎంపిడిఒ గోవిందరాజు, ఎంపిటిసి ఎకె సుందర్ రాజ్, గ్రామసర్పంచ్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.










