Feb 08,2023 22:09

ఫొటో : వినతిని స్వీకరిస్తున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

గడప గడపకు మన ప్రభుత్వం
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని కృష్ణాపురం, బెడుసుపల్లిలో బుధవారం రెండో రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి నిర్వహించారు. గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం తరఫున పథకాల వివరాలను బుక్లెట్‌ రూపంలో అందజేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలన్నింటికీ నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపుతామని తెలిపారు. గతంలో ప్రతి ఇంటికి వాలంటీర్లు తిరిగి వారి సమస్యలను ఆడిగి తెలుసుకున్నారన్నారు. చిన్నచిన్న సమస్యలు మిగిలి ఉన్నాయని, వాటన్నింటిని నమోదు చేసుకుని పరిష్కరిస్తామని తెలిపారు.
రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయని, వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. కొంతమంది అగ్రిమెంట్ల రూపంలో భూములు కొన్నారని, ఆ భూములకు సాదాబైనామా ద్వారా పరిష్కారం చూపి ప్రతి ఒక్కరికీ పట్టాదారు పాసుపుస్తకాలు అందజేస్తామన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా వచ్చిన సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరిస్తామన్నారు. రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన ఇన్పుట్‌ సబ్సిడీలు, విత్తనాలు, ఎరువులు అన్ని సకాలంలో అందుతున్నాయని, ఈ క్రాప్‌ నమోదు. ద్వారా రైతులకు మరింత మేలు చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో కన్వీనర్‌ సుబ్బిరెడ్డి, మాజీ కన్వీనర్‌ శ్రీనివాసులు నాయుడు, మండల సచివాలయాల కన్వీనర్‌ సిద్ధంరెడ్డి మోహన్‌ రెడ్డి, బూదవాడ సచివాలయ కన్వీనర్‌ ప్రతాప్‌ రెడ్డి, వైసిపి నాయకులు బేరి రామ్మోహన్‌ రెడ్డి, లక్ష్మీరెడ్డి, సిద్ధారెడ్డి ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, పలు శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.