ప్రచారం చేస్తున్న ఎంఎల్‌ఎ అనిల్‌కుమార్
గడప గడపకు మన ప్రభుత్వం
నెల్లూరు:నగరంలోని 11వ డివిజన్ చెరుకుతోట, అర్బన్ హెల్త్ సెంటర్ చుట్టుపక్కల తదితర ప్రాంతాలలో నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనిల్ కుమార్ గడప గడపకు మన ప్రభుత్వం 113వ రోజు కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ, స్థానిక సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తున్నామన్నారు. ఎవరైతే చిన్న చిన్న ఇబ్బందుల వాళ్ళ సంక్షేమ పథకాలు కోల్పోయారో అలాంటి వారిని గుర్తించి అర్హులైనవారందరికీ పథకాలు అందించే విధంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గోతం అరుణ వైసీపీ నాయకులు గోతం.బాలకష్ణ,పి.షాకేష్ రెడ్డి, సిహెచ్.కొండయ్య ఆవుల.శ్రీనివాసులు, శ్రీను, సులోచన, సుకుమార్, కష్ణ,సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










