'గడప గడపకు మన ప్రభుత్వం'
ప్రజాశక్తి-బిట్రగుంట : బోగోలు మండలం జువ్వలదిన్నె పంచాయతీ పాతకడపలెం గ్రామంలో శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి పాల్గొని కరపత్రాలు పంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోగోలు మండలంలో జూలదిన్నె గ్రామంలో ఏర్పాటు చేసిన షిప్పింగ్ యార్డ్‌తో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార సోదరులకు నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరుకుతుందన్నారు. ప్రభుత్వ ఫలాలను ప్రతిఒక్క కుటుంబానికి చేరేలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో బోగోలు మండలం వైసిపి మండల కన్వీనర్ మద్దిబోయిన వీర రఘు, స్థానిక నాయకులు గోవిందు, మేకల శ్రీను, పెంచలయ్య, ఉదరు, తోటపల్లి సాగర్, నాయక్ రసూల్, గండూరి శ్రీను, మద్ది బోయిన శేఖర్ యాదవ్, పెండ్లి వెంకటేశ్వర్లు, స్థానిక నేతలు పెద్దకాపు, మత్స్యకారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










