Apr 22,2023 21:25

ఫొటో : మాట్లాడుతున్న చేజర్ల మండల వైసిపి కన్వీనర్‌ తూమాటి విజయభాస్కర్‌ రెడ్డి

'గడప గడపకు మన ప్రభుత్వం'
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ (చేజర్ల) : మండలంలో పాడేరు సచివాలయం పరిధిలోని చీర్లవారికండ్రికలో శనివారం గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి సూచనల మేరకు చేజర్ల మండల వైసిపి కన్వీనర్‌ తూమాటి విజయభాస్కర్‌ రెడ్డి ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ లబ్ధి కరపత్రాలను అందజేశారు. ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందాయా, సంతోషంగా ఉన్నారా అని తూమాటి విజయభాస్కర్‌ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌ క్రాంతిపథం డిఆర్‌డిఎ సి.సుజీవన, సిసిఎన్‌ పుల్లయ్య, ఇరిగేషన్‌ ఎఇ సురేష్‌, విఆర్‌ఒ కె.లక్ష్మినరసింహ ప్రసాద్‌, విఒఎ అనిత, గ్రామస్తులు, నాయుకులు సానా రమణయ్య, పంకు నాగేశ్వరరావు, సానా శ్రీనివాస రెడ్డి, జి.రామచందయ్య, ఆనంద్‌ రెడ్డి, సుధీర్‌ రెడ్డి, మాజీ ఎంపిటిసి గణేష్‌, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు.